Maganti Gopinath: మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నారా లోకేష్
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి
- సంతాపం వ్యక్తం చేసిన నారా లోకేష్
- మాగంటి అకాల మరణం బాధాకరమన్న లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మాగంటి అకాల మరణం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాగంటి కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ ఈరోజు కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Also Read: Jangaon: వివాహిత అదృశ్యం.. ఆ కారణంతో తాను చనిపోతున్నట్లు లెటర్
Also Read
‘హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి దిగ్ర్భాంతికి గురిచేసింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరం. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!