శబరిమల ప్రస్తుతం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఆన్‌లైన్ స్లాట్‌లో అధికారులు 70 వేల టికెట్లు ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో మరో పాతిక వేల మందికి…