Farmers: రైతులకు బ్యాడ్ న్యూస్.. వాటి ధరలు పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian Sellers Stop Fertilizers Discounts to India: డీఏపీ, యూరియా రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ కు ఎరవులు సరఫరా చేయడంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న రష్యా సప్లైను కఠినతరం చేసింది. ప్రపంచ దేశాలకు చైనా కూడా ఎరువులను అందించేది. అయితే చైనా వీటి సరఫరాను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రష్యా ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ దిగింది. దీంతో రష్యా మార్కెట్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఎరువులపై ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేశాయి. కేవలం మార్కెట్ ధరకు మాత్రమే యూరియా, డీఏపీ లాంటి వాటిని విక్రయిస్తున్నాయని భారత ఎరువుల కంపెనీలు పేర్కొంటున్నాయి. రష్యా కంపెనీలు ఆగస్టు నెల నుంచి ఇలా చేస్తున్నాయని, దీంతో దిగుమతి ఖర్చులు భారంగా మారాయని ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి.
Also Read: Shanti Dhariwal: కోటాలో విద్యార్థుల సూసైడ్.. ఎఫైర్ల వల్లే అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
Also Read
- CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
- West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
- Supreme Court: జంతర్ మంతర్ ‘‘పెల్లెట్ గన్’’ వివాదం.. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు..
- Marriage Cheating Case: ఎంతకు తెగించార్రా.. అమ్మాయి అని చెప్పి ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి చేశారంటూ యువకుడు ఫిర్యాదు
అయితే గతేడాది ఈ ఎరువులపై రష్యా సబ్సిడీ ఇవ్వడంతో భారతదేశం దిగుమతలు 202-23 ఆర్థిక సంవత్సరంలో 246% పెరిగి రికార్డు స్థాయిలో 4.35 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. దీని కారణంగా చైనా, ఈజిప్ట్, జోర్డాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా ఇతర ఎరువుల ఎగుమతిదారుల నుంచి భారత్ కొనుగోలులు ఘణనీయంగా తగ్గాయి. గతంలో రష్యన్ కంపెనీలు డీఏపీకి టన్నుకు 80 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చాయని ఇప్పుడు ఐదు డాలర్ల డిస్కౌంట్ కూడా ఇవ్వలేదని భారతీయ కంపెనీ ఒకటి పేర్కొంది. గ్లోబల్ ఎరువుల ధరలు గత రెండు నెలలుగా పెరుగుతున్నాయి, గోధుమ పంటకు సంబంధించి డీఏపీ డిమాండ్ పెరిగినప్పుడు రాబోయే శీతాకాలంలో స్టాక్లను సేకరించడం భారతీయ కంపెనీలకు సవాలుగా మారిందని ముంబైకి చెందిన ఎరువుల కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. జూలైలో, ప్రపంచ ఎరువుల సరఫరాదారులు CFR ఆధారంగా టన్నుకు సుమారు $300 చొప్పున యూరియాను అందిస్తున్నారని, కానీ ఇప్పుడు టన్నుకు $400 కోట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. జూలైలో డీఏపీ ధరలు టన్నుకు దాదాపు 440 డాలర్లుగా ఉందని ఆయన తెలిపారు. ఎరువుల ధరలు పెరగడం అనేది కచ్ఛితంగా రైతులపై భారం కానుందని చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్‌తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?