Robbery: రూ.6కోట్ల విలువైన నగలు దోచారు… రూ.100 పేటీఎం చేసి దొరికిపోయారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత పెద్ద దొంగలైనా.. కొన్ని సార్లు చిన్న క్లూతో దొరికిపోతుంటారు.. ఇప్పుడు.. ఢిల్లీలోనే అలాంటి ఘటనే జరిగింది… ఏకంగా రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు ఎత్తికెళ్లిన ముఠా.. రూ.100 పేటీఎం చేసి దొరికిపోయింది.. ఆ ఒక్కటే.. ఆ ముఠా గుట్టురట్టు చేసింది.. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం ఇద్దరు వ్యక్తలు పహర్‌గంజ్‌లోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వస్తున్నారు.. వీరిలో ఒకరు పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నాడు.. కొద్ది దూరం తర్వాత బ్యాగు పట్టుకుని వస్తున్న ఆ ఇద్దరినీ అడ్డుకున్నారు.. వారితో మరో ఇద్దరు కలిసి.. చేతిలో బ్యాగు ఉన్న వ్యక్తుల కళ్లలో కారం కొట్టి.. ఆ బ్యాగ్‌తో ఉడాయించారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
Read Also: Tammineni Veerabhadram: టీఆర్ఎస్కు మద్దతు రాజకీయ ఎత్తుగడ.. త్వరలో పాదయాత్ర..
Also Read
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
బాధితుడు సోమ్‌వీర్ చండీగఢ్‌లోని ఓ పార్సిల్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. బుధవారం ఉదయం 4.15 గంటల సమయంలో మరో ఉద్యోగి జగదీప్ సైనీతో కలిసి పహర్‌గంజ్‌లోని తమ ఆఫీసు నుంచి పార్సిల్ తీసుకుని డీబీజీ రోడ్డు వైపు వెళ్తున్నారు.. అయితే, మిలీనియం హోటల్ వద్దకు వారు చేరుకోగానే.. పోలీసు యూనిఫామ్‌లో ఉన్న ఓ యువకుడితో పాటు మరో వ్యక్తి వారిని ఆపి.. బ్యాగులు చెక్ చేయాలని అన్నాడు. ఇదే సమయంలో మరో ఇద్దరు వచ్చి.. బాధితుల కళ్లలో కారం కొట్టి బ్యాగులుతో పరారయ్యారు.. అయితే, ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులకు సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడ్డాయి..
వారం రోజుల రోజులకు సంబంధించి ఆ ప్రాంతంలోని 700 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు.. ఇంటెలిజెన్స్ పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించారు.. వారిలో ఒకడు క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగా.. టీ తాగడానికి మరొకడు పేటీఎం నుంచి రూ.100 డ్రైవర్‌కు ట్రాన్సఫర్ చేసి తీసుకున్నట్టు గుర్తించారు.. దీంతో.. ఆ పేటీఎం లావాదేవీలపై దృష్టిపెట్టిన పోలీసులు.. ఆ దొంగలు నజఫ్‌గడ్‌కు చెందినవారిగా గుర్తించారు.. వారంతా రాజస్థాన్‌కు పారిపోయినట్ నిర్ధారణకు వచ్చారు.. ఓ టీమ్‌ను అక్కడికి పంపి.. ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.6 కోట్ల విలువైన 6.3 కిలోల బంగారం, మూడు కిలోల వెండి, 106 ముడి వజ్రాలు, ఇతర వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు.. మొత్తంగా వంద రూపాయలు పేటీఎం చేసి దొరికిపోయారు ఈ బంగారం దోపిడీ దొంగలు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!