India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- భారత్, యూకే వైద్య పరిస్థితులపై డాక్టర్ వీడియో..
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్..
- భారత్‌లో సులభంగా వైద్యం, మెడిసిన్స్ దొరుకుతాయన్న డాక్టర్..
- యూకేలో ఎంత కష్టమో వివరిస్తూ ఇన్‌స్టాలో వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs UK Healthcare: యునైటెడ్ కింగ్డమ్, భారత వైద్య వ్యవస్థలను పోలుస్తూ భారతీయ వైద్యురాలు చేసిన వీడియో నెటింట వైరల్‌గా మారింది. రాత్రి వేళ భర్తకు అకస్మాత్తుగా అనారోగ్యం రావడంతో మందుల కోసం బయటకు వెళ్లిన వైద్యురాలు భారత్‌లో వైద్య సేవలు, మందుల లభ్యత ఎంత సులభంగా లభిస్తాయనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలతో ఆమె చేసిన పోలిక భారత వైద్య వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేస్తోంది.
డాక్టర్ దీపాంజలి శర్మ తన భర్త, ఆయన కూడా వైద్యుడే, ఒక సాయంత్రం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వివరించారు. తొలుత ఆయనకు తలనొప్పి రావడంతో పాటు ఆ తర్వాత వరుసగా వాంతులు చేసుకున్నారు. దీంతో రాత్రి 10 గంటలకు ఆమె మందులు తీసుకురావడానికి బయటకు వెళ్లారు. ‘‘ఆయన కోసం కొన్ని మందులు, ఐవీ ఇంజెక్షన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో భారత్‌లో ఉండటం ఎంత గొప్ప విషయమో నాకు అనిపిస్తుంది’’ అని ఆమె చెప్పారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాను వైద్యురాలు అయినప్పటికీ పాశ్చాత్య దేశాల్లో వైద్య సేవల్లో తనకు ఎదురైన అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు. విదేశాల్లో సాధారణ పని వేళలు దాటిన తర్వాత ఎమర్జెన్సీ వైద్య సహాయం లేదా కొన్ని మందులు పొందడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. బిట్రన్ లేదా ఇతర వెస్ట్రన్ కంట్రీల్లో ఉంటే క్యూలో వేచి ఉండాల్సి వచ్చేదని, ఎమర్జెన్సీ విభాగాల్లో ఇప్పటికే ఒత్తిడి ఉండటంతో నా భర్తకు తక్షణమే సాయం అందే అవకాశం తక్కువ అని చెప్పారు. మెడిసిన్స్ కూడా సులభంగా పొందడం కష్టం ఉందన్నారు.
అయితే, భారత్‌లో మాత్రం ఎంత రాత్రి అయినా బయటకు వెళ్లి మందులు తెచ్చుకుని తిరిగి ఇంటికి వచ్చి భర్తను చూసుకునే అవకాశం తనకు ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, భారతీయ వైద్య వ్యవస్థలో లోపాలు లేవని తాను చెప్పడం లేదని డాక్టర్ శర్మ స్పష్టం చేశారు. మన దేశంలో కూడా మెరుగుపరచాల్సిన విషయాలు ఉన్నాయని, ఏ దేశం కూడా 100 శాతం ఎక్స్పీరియన్స్ అందించదనే విషయాన్ని మర్చిపోకూడదని ఆమె అన్నారు. భారత్‌లో ప్రతీ ఒక్కరికి సులభంగా వైద్యం అందుతుందని ఆమె అన్నారు.
ఆమె వీడియోపై భారతీయులు భారీగా స్పందిస్తున్నారు. 24 గంటల ఫార్మసీలు, వైద్య సేవలు భారత్‌లో అందుబాటులో ఉంటాయని, మందులు త్వరగా దొరుకుతాయని నెటిజన్లు పేర్కొన్నారు. అయితే, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు సులభంగా లభించడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది డాక్టర్ శర్మ వ్యాఖ్యలతో ఏకీభవించారు.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!