ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాన్పుర్ కు సమీపంలోని సచేండి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణం చేస్తున్న బస్సు ఓ లోడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని తీవ్రదిగ్బాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల సాయం ప్రకటించారు. అదే విధంగా యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇస్తామని హామి ఇచ్చారు.