1985 ఎయిర్ఇండియా ఫ్లైట్ బాంబ్ దాడిలో ఆరోపణలు ఎదుర్కొని, ప్రధాన నిందితుడనే ఆరోపణలు ఉన్న రిపుదమన్ సింగ్ మాలిక్ దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఆయన్న దుండగుడు కాల్చిచంపాడు. ఈ విషయాన్ని రిపుదమన్ సింగ్ కొడుకు జస్ప్రీత్ మాలిక్ ధ్రువీకరించారు. ఎయిర్ఇండియా బాంబు దాడిలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా మా తండ్రిని ఎప్పడూ మీడియా సూచిస్తుందని.. తన తండ్రిపై జరిగిన దాడితో దానికి సంబంధి లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. 1985 ఎయిర్ ఇండియా బాంబు దాడి ఘటనలో నిర్దోషులుగా విడుదలైన ఇద్దరిలో రిపుదమన్ సింగ్ మాలిక్ ఒకరు.
ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ తుపాకీ పేలిన శబ్ధం విన్నానని.. వచ్చి చూసేసరికి రిపుదమన్ సింగ్ కారులో అపస్మారక స్థితిలో పడిఉన్నాడని తెలిసింది. ఈ హత్య టార్గెట్ చేసి చంపినట్లు కనిపిస్తుందని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: CM YS Jagan: గోదావరి ఉగ్రరూపం.. సీఎం జగన్ ఏరియల్ సర్వే..
జూన్ 23, 1985న మాంట్రియల్-లండన్-ఢిల్లీ-ముంబై ఎయిర్ ఇండియా విమానాన్ని మార్గం మధ్యలో ఉండగా, బాంబు దాడి చేసి కూల్చివేసిన ఘటనలో మాలిక్ తో పాటు అజైబ్ సింగ్ బగ్రీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వీరిద్దరిని మార్చి 2005న కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 మాంట్రియల్ నుంచి లండన్ మార్గంలో 31 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూల్చివేయబడింది. ఈ ఘటనలో మొత్తం 331 మంది చనిపోయారు.