RG Kar Ex-Principal: ఈడీ సోదాల్లో వెలుగులోకి సందీప్ ఘోష్ లగ్జరీ బంగ్లా.. కీలక పత్రాలు స్వాధీనం..!
- ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు..
- ఈడీ సోదాల్లో బయట పడిన సందీప్ ఘోష్ లగ్జరీ బంగ్లా..
- ప్రాపర్టీ సందీప్ ఘోష్‌తో పాటు భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Ex-Principal: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్ ఘోష్‌కు సంబంధించిన రెండతస్తుల ఓ లగ్జరీ ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్ ఘోష్‌తో పాటు భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు తెలిపాయి.
Read Also: Ganesh Chaturthi: ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా 75 అడుగుల బెల్లం వినాయకుడు
Also Read
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
కాగా, లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. సంగీత- సందీప్ విల్లా అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు వెల్లడైంది. ఇక, ఆ బంగ్లాను ‘డాక్టర్ బాబు’ ఇల్లు అని పిలుస్తామని.. సందీప్ ఘోష్ తరచూ ఫ్యామిలీతో ఇక్కడికి వస్తారని స్థానికులు చెప్పుకొచ్చారు. డాక్టర్ సందీప్ ఘోష్ సూచనల మేరకు ఈ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్‌లు నిర్మించినట్లు, భూములను కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆరోపణ గుప్పించాయి. మొత్తం 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ప్రసూన్ ఛటోపాధ్యాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Read Also: Pan World Ganesh Chaturthi: మన గణపయ్య పాన్ వరల్డ్.. ఉగాండాలో చవితి వేడుకలు..!
ఇక, జూనియర్ డాక్టర్ హత్యాచార, హత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్‌కత్తా హైకోర్టు.. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు విచారణను సైతం సీబీఐకే హ్యండోవర్ చేసింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా హైకోర్టు ఇటీవల 8 రోజల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..