Pan World Ganesh Chaturthi: ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. భారతదేశంతో పాటు పలు దేశాల్లో మన గణనాథున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దీంతో విదేశాల్లో పలు పేర్లలో పూజలందుకుంటున్నాడు.. థాయ్ లాండ్ ప్రజలు లంబోదరుడిని ఫిరా ఫికానెట్ పేరుతో పిలిస్తే.. ఇక, టిబెట్ లో మహారక్త గణపతి రూపాల్లో ఆరాధిస్తారు అక్కడి ప్రజలు. ఇండినేషియాలో మాంత్రిక కర్మలతో అడ్డంకులు తొలగించే దేవునిగా వినాయకుడిని భావించి కొలుస్తారు. చైనాలో హువాంగ్ సీ టియాన్, జపాన్ లో కంగిటెన్ అని పిలుచుకుంటారు. అలాగే, కాంబోడియా, ఆఫ్గానిస్థాన్ లోనూ ఏకదంతుడికి ఆలయాలు ఉన్నాయి.
Read Also: Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో ఈ ఏడాది ఒక కొత్త రూల్.. ఏంటో తెలుసా?
అయితే, ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా స్టార్ట్ అయ్యాయి. అక్కడి సంప్రదాయ డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఉగాండా వాసులు గణనాథునికి ఘన స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అలాగే, మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణేష్ నవరాత్రి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని లాల్‌బాగ్‌లో ప్రతి ఏటా ప్రతిష్టించే అత్యంత ఎత్తైన వినాయకుడికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కిలోల బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేసింది. రూ.15 కోట్ల విలువైన ఈ కిరిటాన్ని గణేష్‌కు అలంకరించిన వీడియోను నెట్టింట్ వైరల్ గా మారింది.
Auspicious Celebrations of Ganesh Chaturthi in Uganda🇺🇬 pic.twitter.com/iDTGFc3He0
— Vertigo_Warrior (@VertigoWarrior) September 6, 2024