Delhi University: మోడీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు.. నల్లరంగు దుస్తులు ధరించవద్దని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi University: అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్యటనల సందర్భంగా ఆంక్షలను విధించడం సర్వసాధారణం. అయితే ఆ ఆంక్షలు ట్రాఫిక్‌కు ఇబ్బంది రాకుండా చూడటానికి ఎక్కువగా పెడతారు. కానీ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీలో శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యార్థులు గానీ, ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ కూడా నల్లరంగు దుస్తులు వేసుకోరాదని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. నల్లరంగు దుస్తులు ధరిస్తే ప్రధాని మోడీ పర్యటనకు నిరసన తెలిపినట్టు అవుతుందని అధికారలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.
Read also: SPY Collections: ‘స్పై’ బాలేదనుకుంటూనే బాక్సాఫీసు వద్ద ఈ కలెక్షన్లు ఏంటి సామీ!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేడుకలకు యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రతలో ఎలాంటి లోపం తలెత్తకుండా ఉండేందుకు కొద్ది రోజుల ముందే భద్రతా బలగాలను యూనివర్సిటీలో మోహరించారు. వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే విద్యార్థులకు, అధ్యాపకులకు ఢిల్లీ యూనివర్సిటీ మరియు కాలేజీలు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశాయి. ప్రధాని మోదీ పాల్గొనే శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, ఉత్సావాల్లో నల్లటి దుస్తులు ధరించరాదని ఆదేశించారు. అలాగే.. ఢిల్లీలోని హిందూ కళాశాల, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కళాశాల , జాకీర్ హుస్సేన్ కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా ప్రధాని ఈవెంట్ కు హాజరు కావాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనే విద్యార్థులు తమ ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలని, సమావేశానికి గంటన్నర ముందుగా రావాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి హజరయ్యే విద్యార్థులు నల్ల దుస్తులు ధరించకూడదని హిందూ కళాశాల ఉపాధ్యాయుడు-ఇన్‌చార్జ్ మీను శ్రీవాస్తవ నోటీసులో తెలిపారు. హిందూ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ మాత్రం అటువంటి పరిపాలన నోటీసులను జారీ చేయలేదని చెప్పారు. లైవ్ టెలికాస్ట్ గురించి విద్యార్థులకు, అధ్యాపకులందరికీ తాను మెయిల్ చేసాననీ, దానికి హాజరు కావాలని వారిని కోరాననీ, హాజరు తప్పనిసరి కాదని ప్రిన్సిపాల్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కళాశాలలో జరిగే లైవ్ వెబ్ టెలికాస్ట్ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను యూనివర్సిటీకి అందజేస్తామని చెప్పారు.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే సమయంలో డీయూలో మూడు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనాలను ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్ కోసం కేటాయించనున్నారు. వచ్చే రెండేళ్లలో మూడు భవనాలు పూర్తవుతాయి. లోగో బుక్‌తో సహా మూడు కాఫీ టేబుల్ పుస్తకాలను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ప్రధాని హాజరయ్యే కార్యక్రమానికి విద్యార్థులు అందరూ తప్పకుండా హాజరు కావాలని, నల్లరంగు దుస్తులు ధరించరాదనే నిబంధన విధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!