New Shot in Cricket History: క్రికెట్‌లో ఎన్నో రకాల షాట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్క్వేర్ కట్, అప్పర్ కట్, స్కూప్ షాట్, రివర్స్ స్వీప్, పుల్ షాట్, హెలికాప్టర్ షాట్, స్విచ్ హిట్.. ఇలా ఎన్నింటినో మనం చూశాం. టీ20లు వచ్చాక మాత్రం క్రికెట్‌లో సరికొత్త షాట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిని మనం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం కూడా. ఒక్కోసారి అయితే ఇలాంటి షాట్ కూడా ఉంటదా? అని అనుకున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా మరో సరికొత్త షాట్‌ను ఓ బ్యాటర్ పరిచయం చేశాడు. అది క్రికెట్ చరిత్రలోనే సరికొత్త షాట్ అనేలా ఉంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు తెలియలేదు కానీ.. సరికొత్త షాట్‌కు సంబందించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. బౌలర్ బంతి వేయడానికి రనప్ చేస్తుండగా, బ్యాటర్ వికెట్ల వెనకాలకు వెళ్లి బంతిని బాదాలని ముందే ఫిక్స్ అయిపోయాడు. దాంతో బంతి బౌలర్ చేతిలో నుంచి డెలివరీ కాకముందే.. బ్యాటర్ వికెట్ల వెనకాలకు వెళ్ళిపోయాడు. ఇక బంతి పడడమే ఆలస్యం.. రివర్స్ స్కూప్ షాట్‌తో భారీ సిక్స్ బాదాడు. ఈ షాట్ చూసిన కీపర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ప్రస్తుతం సరికొత్త షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. బ్యాటర్ ఏకంగా వికెట్ల వెనుకాకు పరుగెత్తి ఆడిన ఈ స్కూప్ షాట్ అభిమానులను తెగ అలరిస్తోంది. ఈ వీడియోకి లైకుల వర్షం కురుస్తోంది. ఈ వీడియోపై అభిమానులు, నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే వింత షాట్’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘క్రికెట్ చరిత్రలోనే సరికొత్త షాట్’ అని ఇంకొకరు ట్వీట్ చేసారు. ‘ఈ షాట్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ట్రై చేయాలి’, ‘ఎవరండీ ఇతడు’, ‘ఎక్కడ ఉన్నాడో వెతకండి రా’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Bank Accounts Rules: ఓ వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఎలా ఉన్నాయంటే?
— Out Of Context Cricket (@GemsOfCricket) June 28, 2023