Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rbi Keeps Key Lending Rate Unchanged At 6 5 For 10th Consecutive Time

RBI Interest Rates: కీలక వడ్డీరేట్లు యథాతథం.. 10వ సారి మార్పులు చేయని ఆర్బీఐ

Published Date :October 9, 2024 , 10:33 am
By Chandra Shekhar Pamena
  • ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత్ దాస్..
  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లు యథాతథం..
  • రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..
RBI Interest Rates: కీలక వడ్డీరేట్లు యథాతథం.. 10వ సారి మార్పులు చేయని ఆర్బీఐ
  • Follow Us :
  • google news
  • dailyhunt

RBI Interest Rates: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సోమవారం నుంచి 3 రోజుల పాటు కొనసాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈరోజు (బుధవారం) ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తుంది. ఎలాంటి మార్పులు చేయకపోవడం ఆర్బీఐకి ఇది 10వ సారి.

Read Also: World Post Day 2024: నేడే ప్రపంచ తపాలా దినోత్సవం.. తపాలా చరిత్ర, ప్రాముఖ్యత

Also Read

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
  • Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్‌
  • Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

అయితే, ప్రస్తుత పరిణామాల ప్రకారం రెపో రేటు తగ్గింపు డిసెంబర్ లో జరిగే సమావేశంలో ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఓటు వేసినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ వెల్లడించిన రేట్లు గుడ్ రిటర్న్ నిర్వహించిన పోల్ కి అనుకూలంగా ఉన్నాయి. అటు ద్రవ్యోల్బణంతో పాటు ఇటు వృద్ధి రేటును బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈసారి కూడా రిజర్వు బ్యాంక్ తన ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా, అసమానంగా ఉంటుందని శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు.

Read Also: Papaya: విషమే తింటున్నాం!. వాటిని తింటే క్యాన్సర్ రావడం ఖాయం.. చెక్ పెట్టండిలా..

అలాగే, ప్రభుత్వ వినియోగం మెరుగుపడుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మెుదటి త్రైమాసికంలో 8 ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి 1.8 శాతం తగ్గిందని.. FY25 మెుదటి త్రైమాసికంలో 7.2 శాతం, రెండవ త్రైమాసికంలో 7 శాతం, మూడవ త్రైమాసికంలో 7.4 శాతం, నాల్గవ త్రైమాసికంలో 7.4 శాతం వద్ద ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఇదే క్రమంలో FY 26 మెుదటి త్రైమాసికంలో వృద్ధిని 7.3 శాతం ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే, ద్రవ్యోల్బణంపై కూడా ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ.. అంతర్జాతీయంగా, దేశీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని మూడవ త్రైమాసికంలో ఇది స్వల్పంగా పెరిగి 4.8 శాతంగా ఉండవచ్చన్నారు. ఇక, నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గి 4.2 శాతానికి చేరుకుంటుందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • interest rate
  • Monetary Policy Committee
  • RBI
  • RBI Interest Rates
  • Reserve Bank of India

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions