Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rose Lassi Recipe: వేసవి కాలంలో చల్లని పానీయాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో సాధారణ లస్సీకి బదులుగా రోజ్ లస్సీ తాగితే రుచి, సువాసన, చల్లదనం అన్నీ ఒకేసారి లభిస్తాయి. లేత గులాబీ రంగుతో కనిపించే ఈ డ్రింక్ చూడగానే తాగాలనిపిస్తుంది. ఒక్కసారి రుచి చూస్తే మరో గ్లాస్ అడగకుండా ఉండలేరు. రోజ్ లస్సీ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. గులాబీ సారం శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. ఎసిడిటీ, వేడి కారణంగా కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు మేలు చేస్తాయి. దీంతో ఇది వేసవికి పర్ఫెక్ట్ డ్రింక్‌గా మారుతుంది.
రోజ్ లస్సీకి కావలసిన పదార్థాలు
* తాజా చిక్కటి పెరుగు – 2 కప్పులు
* రోజ్ సిరప్ లేదా రూహ్ అఫ్జా – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
* పాల మీగడ – 1 టేబుల్ స్పూన్
* యాలకుల పొడి – 1/4 టీస్పూన్
* పిస్తా తురుము – 1 టేబుల్ స్పూన్
* ఎండిన లేదా తాజా గులాబీ రేకులు
* చల్లటి నీరు లేదా పాలు – అర కప్పు
* ఐస్ క్యూబ్స్ – అవసరానికి తగినంత
Also Read
తయారీ విధానం
ముందుగా బ్లెండర్ జార్‌లో పెరుగు, రోజ్ సిరప్, యాలకుల పొడి, చల్లటి నీరు లేదా పాలు వేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేయాలి. మిశ్రమం చిక్కగా, నురుగు వచ్చేవరకు కలపాలి. రోజ్ సిరప్‌లో ఇప్పటికే తీపి ఉంటుంది కాబట్టి ముందుగా రుచి చూసి అవసరమైతే మాత్రమే అదనంగా చక్కెర వేయాలి. తయారైన రోజ్ లస్సీని పొడవాటి గ్లాసుల్లో పోసి పైన ఒక చెంచా క్రీమ్ వేయాలి. ఆపై పిస్తా తురుము, గులాబీ రేకులతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి.
ఎందుకు ప్రత్యేకం?
రోజ్ లస్సీ తాగితే చల్లదనంతో పాటు రాజసం ఉట్టిపడే రుచి కూడా లభిస్తుంది. మార్కెట్లో దొరికే కోల్డ్ డ్రింక్స్‌కి బదులుగా ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు. వేసవిలో అతిథులకు సర్వ్ చేస్తే ఖచ్చితంగా రెసిపీ అడుగుతారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!