Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సంజూ, ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మరో అద్భుత శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్ 2026లో సంజూకు రెండో శతకం ఇది. మైదానంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం బెదరకుండా క్రీజులో పాతుకుపోయిన శాంసన్, తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. నిలకడలేమి అన్న విమర్శలకు తన బ్యాట్‌తోనే గట్టి సమాధానమిస్తూ, ఈ మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 క్లాసిక్ బౌండరీలు, 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.
ఈ మ్యాచ్‌లో సంజూకి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రేవిస్ (22), దినేష్ కార్తిక్ (18), మరియు ఓవర్టన్ (15) తమ వంతు సహకారాన్ని అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు నమోదైంది. ముంబై బౌలర్లలో ఘజానన్, అశ్వనీ చెరో రెండు వికెట్లు తీసి వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలని చూసినా, సంజూ సృష్టించిన విధ్వంసం ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ సెంచరీతో సంజూ శాంసన్ టీ20 క్రికెట్ చరిత్రలో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ (చెరో 9 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా.. సంజూ శాంసన్ తన 8వ శతకంతో రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇక ఐపీఎల్ చరిత్ర విషయానికొస్తే.. అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లలో కోహ్లీ (8), జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) తర్వాత 5 సెంచరీలతో సంజూ శాంసన్, కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రికార్డులన్నీ బద్ధలు కొట్టిన సంజూ, ముంబై ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచాడు. సంజూ చూపించిన ఈ వీరవిహారం అతన్ని భారత టీ20 క్రికెట్‌లో మరో స్థాయికి తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!