Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఓటింగ్ సునామీ..
- స్వాతంత్య్రం తర్వాత రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elections 2026: పశ్చిమ బెంగాల్ తొలి విడత, తమిళనాడు ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు సునామీ సృష్టించారు. 1947 స్వాతంత్ర్యం అనంతరం ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో 92.25 శాతం, తమిళనాడులో 85.03 శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ భారీగా పెరగడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. ఓటర్ల బలమైన భాగస్వామ్యానికి నిదర్శనమని అభివర్ణించారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టమని చెప్పారు.
Read Also: Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉంటే, తొలివిడతలో భాగంగా గురువారం 152 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో మిగిలిన అసెంబ్లీలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. బెంగాల్ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్‌లో టీఎంసీ, హుయాయున్ కబీర్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, పెరిగిన ఓటింగ్ ప్రజల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపు ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోందని మళ్లీ టీఎంసీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ఈ ఓటింగ్‌ను మార్పుకు సంకేతంగా అభివర్ణించారు.
మరోవైపు, తమిళనాడులో కూడా ఇదే తరహాలో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. మొత్తం 234 స్థానాలకు ఒకే రోజు ఎన్నికలు జరిగాయి. డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఎండల్ని సైతం లెక్క చేయకుండా పల్లెలు, పట్టణాల్లో ఓటర్లు బారులు తీరారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!