Darshan Case: దర్శన్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రేణుకాస్వామి హత్యలో కొత్త సాక్ష్యాలు..
- రేణుకా స్వామి హత్యలో దర్శన్‌కి బిగుస్తున్న ఉచ్చు..
- మరిన్ని కొత్త సాక్ష్యాలతో చార్జ్ షీట్..
- వెలుగులోకి దర్శన్‌తో సహా నిందితుల ఫోటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కి ఉచ్చు బిగుసుకుంటోంది. దర్శన్‌తో పాటు అతని సహచరులపై అదనపు చార్జ్ షీట్ ఖరారు కావడంతో రేణుకాస్వామి హత్య కేసు మరో మలుపు తీసుకుంది. చార్జ్ షీట్‌ని ఈ రోజు కోర్టులో దాఖలు చేయనున్నారు. 1000 పేజీల చార్జి షీట్, బలమైన సాంకేతిక, ఫోరెన్సిక్ సాక్ష్యాలను కలిగి ఉంది. ఇది కేసును మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.
Read Also: UK: కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుండి ఫోరెన్సిక్ నివేదికలతో సహా 20కి పైగా సాక్ష్యాలను ఛార్జ్ షీట్ పొందుపరిచినట్లు నివేదించబడింది. ఫోరెన్సిక్ సాక్ష్యాలు దర్శన్‌పై అభియోగాలను మరింత బలపరుస్తాయి. సాక్షి పునీత్ మొబైల్ ఫోన్ నుంచి కొన్ని ఫోటోలను సాక్ష్యాలుగా ఛార్జి షీట్లో పొందుపరిచారు. నేరం జరిగిన ప్రదేశంలో నీలిరంగు టీ షర్ట్, జీన్స్ ధరించిన దర్శన్‌ని చూపుతున్నట్లుగా ఉంది. గతంలో మొబైల్ నుంచి తొలగించిన ఫోటోలను కూడా ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి పొందారు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ సాక్ష్యాలు అందించాయి. దర్శన్‌తో పాటు జగ్గా, అనుకుమార్, రవిశకంర్ వంటి నిందితులకు సంబంధించిన మొత్తం 8 ఫోటోలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, దర్శన్, పవిత్ర గౌడ, మరో ఆరుగురు నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు జస్టిస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ గురువారం విచారించింది. విచారణను నవంబర్ 26కి వాయిదా వేసింది. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామి, దర్శన్ మహిళా స్నేహితురాలు పవిత్ర గౌడని విమర్శిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ హత్య జరిగింది. చిత్రదుర్గకు చెందిన స్వామిని దర్శన్‌ని కల్పిస్తామని నమ్మించి బెంగళూర్ తీసుకువచ్చారు. చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా దాడి చేయడంతో అతడు మరణించాడు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..