Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కి ఉచ్చు బిగుసుకుంటోంది. దర్శన్‌తో పాటు అతని సహచరులపై అదనపు చార్జ్ షీట్ ఖరారు కావడంతో రేణుకాస్వామి హత్య కేసు మరో మలుపు తీసుకుంది. చార్జ్ షీట్‌ని ఈ రోజు కోర్టులో దాఖలు చేయనున్నారు. 1000 పేజీల చార్జి షీట్, బలమైన సాంకేతిక, ఫోరెన్సిక్ సాక్ష్యాలను కలిగి ఉంది. ఇది కేసును మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.
రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అంతేకాకుండా.. వారిపై హత్యానేరం ఎత్తివేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Police Will Be Serve Notice To Actor Chikkanna in Renukaswamy Case: చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ తూగుదీపను కలిసి మాట్లాడిన హాస్యనటుడు చిక్కన్న చిక్కుల్లో పడ్డాడు. ఆయనని మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. రేణుకాస్వామి హత్యకు ముందు జూన్ 8న దర్శన్‌తో పాటు కేసులో నిందితులు ఆర్‌ఆర్‌నగర్‌లోని స్టోనీ బ్రూక్ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నటుడు చిక్కన్న కూడా పాల్గొనడంతో పోలీసులు అతడిని ముందుగా…