Darshan Case: హత్య నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ తనకు దుప్పటి కావాలని కోర్టును కోరాడు. బుధవారం బెంగళూరులోని ట్రయల్ కోర్టులో అదనపు దుప్పటి కోసం విన్నవించుకున్నాడు. చలి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. విచారణ ప్రక్రియ కోసం దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్, ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే, జైలులో ఆయనకు నరకం చూపిస్తున్నారని, ఉగ్రవాదులను ఉంచే హై-సెక్యూరిటీ సెల్‌లో ఒంటరిగా బంధించారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో తీవ్ర వాదనలు వినిపించారు. హత్య కేసులో అరెస్టయిన దర్శన్‌ను జైలు అధికారులు అత్యంత కఠినంగా చూస్తున్నారని ఆయన లాయర్ సివిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ఖైదీలతో కలవకుండా, మానసికంగా వేధించే ఉద్దేశంతో…
Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కి ఉచ్చు బిగుసుకుంటోంది. దర్శన్‌తో పాటు అతని సహచరులపై అదనపు చార్జ్ షీట్ ఖరారు కావడంతో రేణుకాస్వామి హత్య కేసు మరో మలుపు తీసుకుంది. చార్జ్ షీట్‌ని ఈ రోజు కోర్టులో దాఖలు చేయనున్నారు. 1000 పేజీల చార్జి షీట్, బలమైన సాంకేతిక, ఫోరెన్సిక్ సాక్ష్యాలను కలిగి ఉంది. ఇది కేసును మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.
Darshan : రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తుగుదీప శుక్రవారం బెంగళూరులోని కంగేరిలోని ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ కేసులో పోలీసులకు కీలక రిపోర్టు చిక్కింది.
Darshan: కర్ణాటకలో పాటు యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది రేణుకా స్వామి హత్య కేసు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న దర్శన్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు.