వైరల్: జీవితం మలుపు తిప్పిన ఫోటోతో నటుడు ధర్మేంద్ర

సినిమా నటీనటుల విషయంలో ఫొటోగ్రఫీకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతది అందగాళ్ళు/ అందగత్తెలు అయిన ‘స్క్రీన్ టెస్ట్’ లో పాస్ కాకపోతే అంతే సంగతులు. ఎంతో టాలెంట్ వున్నా, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వున్నా సినిమాల్లో రాణించలేని వారు కోకొల్లలు. అయితే ఆడిషన్స్‌ లో అదృష్టం పండి సినిమా అవకాశం వచ్చిందంటే అది వారికి ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకమే.. అలాంటి మధురమైన ఫోటోను బాలీవుడ్​ నటుడు ధర్మేంద్ర అభిమానులతో పంచుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కు ముందు ‘స్క్రీన్ టెస్ట్ విజేత’గా నిలిపింది ఈ ఫోటో అంటూ రాసుకొచ్చాడు. చాలా యంగ్ ఏజ్ లో కనిపిస్తున్న ధర్మేంద్ర.. ఈ ఫొటోలో ముందు సముద్రం, వెనకవైపు భవనాలు అందంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఎక్కువగా షేర్ చేస్తున్నారు.

ఆవేదన: గూగుల్‌ సీఈవోపై నిర్మాత బన్నీ వాసు ప్రశ్నల వర్షం

50 ఏళ్ల నటజీవితంలో ఎంతోమంది అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు ధర్మేంద్ర. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక హిట్స్ దక్కించుకున్న రికార్డు.. ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది. ‘తొలి హీమ్యాన్‌’, ‘యాక్షన్‌ కింగ్‌’ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించిన ఈయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ‘దిల్‌భీ తెరా హమ్‌భీ తేరే’ (1960)తో వెండితెరపై అరంగేట్రం చేశారు. కొద్దికాలంలోనే రొమాంటిక్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందే ధర్మేంద్రకు పెళ్లయినా సినిమాల్లోకి వచ్చాక హేమమాలినితో ప్రేమలో పడ్డాడు. చాలా రోజుల స్నేహం తరువాత ఆమెను పెళ్లి చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by Dharmendra Deol (@aapkadharam)

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-