Amarnath Yatra: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రతీ హిందువు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమూ ఆగస్టు 31 న ముగుస్తుందని జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ రెండు మార్గాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.