పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. సినిమా విడుదల మాత్రం వాయిదా పడుతూనే ఉంది..డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని ఇటీవల కన్ఫర్మేషన్ ఇచ్చింది చిత్రయూనిట్.. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారు.. ఇక సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తారని ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఇక ప్రభాస్ అభిమానులతో పాటు, సినిమా లవర్స్ అంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే సినిమా రిలీజ్ వచ్చే నెలలో ఉన్నా ప్రమోషన్స్ ఏం మొదలు పెట్టట్లేదు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.. తాజాగా మూవీ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.. ప్రమోషన్స్ కోసం సలార్ మూవీ యూనిట్ RCB టీంని దింపింది. సలార్ నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ కన్నడ సంస్థ అని తెలిసిందే. దీంతో ఈ సంస్థ బెంగుళూరు ఐపీఎల్ టీంతో తమ సినిమాలకు ప్రమోషన్స్ చేయిస్తుంది. గతంలో KGF సినిమాకి కూడా RCB టీం ప్రమోషన్స్ చేసింది. తాజాగా సలార్ ట్రైలర్ గురించి RCB టీం ప్రమోట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు.. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
RCB టీం సలార్ కి ప్రమోషన్స్ చేస్తుందని సమాచారం. దీంతో విరాట్, ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి కీలక పాత్రను పోషించింది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..
Just 18 days to go for the #SalaarCeaseFire Trailer launch, on Dec 1st at 7:19 PM! 💥
The excitement is building up as we eagerly await #Salaar from our partners @hombalefilms 🍿#RCBxHombale #ನಮ್ಮRCB #ನಮ್ಮHombale #PlayBold #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel… pic.twitter.com/rphMEb0ODF
— Royal Challengers Bangalore (@RCBTweets) November 13, 2023