Udupi Crime: ఆటోలో వచ్చి.. నలుగురిని హత్య చేసిన దుండగుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 members of a family were stabbed to death in Udupi: కర్ణాటకలోని ఉడుపిలో దారుణం చోటుచేసుకుంది. నేజారు సమీపంలోని తృప్తినగరలో ఓ కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. పావుగంటలోనే అందరిని హతమార్చి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
తృప్తినగరలో హసీనా (46) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. హసీనా భర్త విదేశాల్లో ఉంటుండగా.. ఆమె ఇక్కడే పిల్లలను చూసుకుంటోంది. ఆదివారం తెల్లవారుజామున తెల్లని మాస్కు ధరించి వచ్చిన వ్యక్తి.. ఇంటి ఆవరణలో నిలబడి ఉన్న హసీనాపై కత్తితో దాడి చేశాడు. ఆపై ఇంట్లోకి వెళ్లి అఫ్నాన్ (23), అయ్నాజ్ (21), ఆసిం (12)లను కత్తితో పొడిచి హత్య చేశాడు. హసీనా ఇంట్లో అరుపులు విన్న పొరుగింటి యువతి ఆసిమ్ పరుగెత్తుకు రాగా.. ఆమెపై కూడా నిందితుడు దాడి చేశాడు. ఆపై అతడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆసిమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
పావుగంటలోనే హసీనా కుటుంబంను హత్య చేసిన దుండగుడు తాను వచ్చిన ఆటోలోనే పరారయ్యాడు. తృప్తినగర ఆటో స్టాండ్ వద్ద బైకు పెట్టిన నిందితుడు.. శ్యామ్ అనే వ్యక్తి ఆటోలో హసీనా ఇంటికి వచ్చాడు. హత్య తర్వాత ఆటోస్టాండ్‌కు వెళ్లి.. తన బైకుపై పరారయ్యాడు. నిందితునికి సుమారుగా 45 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు