Ravi Shankar Prasad Questions Rahul Gandhi Over Supreme Court Statement: పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే! ఈ తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణించింది. ఇదే సమయంలో.. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కూడా కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఇన్నాళ్లూ ఈ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? అంటూ ప్రశ్నించారు.
Samantha: జీవితం మరోలా ఉంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సామ్
రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, ఉగ్రవాదుల నిధుల సరఫరాను అడ్డుకుందన్నారు. వారి ఆర్థిక మూలాలు సైతం బాగా దెబ్బతిన్నాయన్న సంగతి నిరూపితమైందన్నారు. ఆదాయ పన్ను వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థను పరిశుభ్రం చేసిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక నిర్ణయమని, అది దేశ ప్రయోజనాల తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి.. ఇన్నాళ్లూ నోట్ల రద్దుకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు సారీ చెప్తారా? అని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతూ.. రాహుల్ గాంధీ విదేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చారన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.
Vaarahi: చిత్ర బృందం సమక్షంలో మీనాక్షి గోస్వామి బర్త్ డే వేడుకలు!
ఇదే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరంపై కూడా రవిశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిదంబరంతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు మెజారిటీ జడ్జిమెంట్‌ని పక్కనపెట్టి.. కేవలం మైనారిటీ జడ్జిమెంట్‌నే పట్టుకొని ఊగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చెంప దెబ్బ తిన్నామని చెప్తున్న చిదంబరం.. మెజారిటీ జడ్జిమెంట్ మీద ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ఊపందుకుందని.. ఈ విషయంలో భారత్ అగ్రగామిగా నిలవడం ఖాయమని చెప్పారు. గత ఏడాదిలో ఒక్క అక్టోబర్ నెలలోనే.. రూ. 12 లక్షల కోట్ల విలువైన 730 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
Bairi Naresh: కావాలనే ఆ వ్యాఖ్యలు చేశా.. విచారణలో బైరి నరేష్ బాంబ్
కాగా.. 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు.. సోమవారం నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని సమర్థించింది. జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ నిర్ణయం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది.