Samantha: సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాను సామ్ షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ సామ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకు అంత ఆనందం, సామ్ ఏం చేసింది..? అని అనుకుంటున్నారా..? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ చాలా రోజుల తరువాత తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఒకప్పుడు సామ్ నెట్టింట్లోనే ఉండేది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేయడం, అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు, చిట్ చాట్ సెషన్ లు, వివాదాలు, విమర్శలు అబ్బో.. సామ్ అప్పట్లో అంతర్జాలాన్ని ఒక ఊపు ఊపింది. ఇక సడెన్ గా ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది.
ఇక సామ్ కనిపించకపోయేసరికి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవ్వడం, ఆమె వ్యాధి బారిన పడిందని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేయడం జరిగాయి. ఎప్పుడెప్పుడు మళ్లీ సామ్ వస్తుందా..? ఆమె దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా..? అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక కొత్త ఏడాది.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లు సామ్ నేడు శాకుంతలం అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వారి మనసులో ఉన్న భావాలను మొత్తం సామ్ ముందు ఏకరువు పెట్టారు. ఇక ఎక్కువగా సామ్ ను అభిమానులు ఇప్పుడు జీవితం ఎలా ఉంది అని ప్రశ్నించగా.. డిఫరెంట్ గా ఉందని, జీవితం మరోలా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి అమ్మడు ఇలానే యాక్టివ్ గా ఉంటుందా..? లేక ఈ ఒక్కరోజు మాత్రమేనా అని తెలియాల్సి ఉంది.