Bairi Naresh Says That He Intentionally Made Commnents On Ayyappa Swamy: ఇటీవల అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ స్టూడెంట్ బైరి నరేష్.. తాను ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు నేరం అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. మత విద్వేషాలకు పాల్పడే ఉద్దేశంతోనే.. బైరి నరేష్ అలాంటి వ్యాఖ్యలు చేశాడని కొడంగల్ స్థానిక కోర్టుకి పోలీసులు సమర్పించిన రిమాండ్ కాపీలో ఉంది. అలాగే.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమంతు సైతం, ఉద్దేశపూర్వకంగానే తాను బైరి నరేష్‌ని పిలిచినట్లు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతేకాదు.. గతంలోనూ బైరీ నరేష్‌పై పలు కేసులు నమోదయ్యాయని ఆ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు అతనిపై ఉన్నట్లు కోర్టుకి తెలిపారు. ప్రస్తుత కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
Helicopters Collide : చూస్తుండగానే ఘోరం.. గాల్లోనే ఢీ కొన్న రెండు హెలికాప్టర్లు.. పలువురి మృత్యువాత
కాగా.. కొడంగల్‌లో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప నువ్వు నా కొంప ముంచావంటూ బహిరంగ సభలో అయ్యప్పస్వామిని కించపరుస్తూ వ్యాఖ్యానించాడు. దీంతో అతడు హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహానికి గురయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు. అనేక పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. చివరికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం.. అతనిపై 24 గంటల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగి.. పరారీలో ఉన్న బైరి నరేష్‌ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అతడ్ని ట్రేస్ చేసిన పోలీసులు.. కరీంనగర్ వెళ్తుండగా, వరంగల్‌లో పట్టుకున్నారు.
Power outage at Airport: ఎయిర్ పోర్టుకు పవర్ కట్.. నిలిచిన 282విమాన సర్వీసులు