Rashtrapatni Row: కాంగ్రెస్ ఎంపీకి మహిళా కమిషన్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Panel Issues Notice To Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేద్ధాం అని చూసిన కాంగ్రెస్ పార్టీ.. అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఢిపెన్స్ లో పడింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ముర్మును ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైంది. గురువారం లోక్ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ తీరును విమర్శించారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలను, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గిరిజన మహిళను గౌరవించే సంప్రదాయం లేదని విమర్శించారు.
తాజాగా రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయన మనస్తత్వాన్ని చూపిస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ రేఖ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని.. అతనిపై పార్టీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అమమానకరమైనవని.. భారతదేశ అత్యున్నత పదవిలో ఉన్న మహిళపై మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తించాలి.. అతను ఇతరులతో కూడా ఇలానే ప్రవర్తిస్తారా.? అని రేఖాశర్మ ప్రశ్నించారు.
Also Read
- Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
- Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
- E20 Petrol: E20 పెట్రోల్‌పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
Read Also: Madhya Pradesh: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. మెజారిటీ స్థానాలు కైవసం
రాష్ట్రపత్ని వ్యాఖ్య దుమారం రేపుతున్న తరుణంలో మహిళాకమిషన్ సోనియాగాంధీకి లేఖ రాసిందని రేఖాశర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధీర్ రంజన్ చౌదరిపై చర్యలు తీసుకోవాలని.. అతను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తో పాటు పలు రాష్ట్రాల మహిళాకమిషన్లు ఖండించాయి. చౌదరికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు కూడా పంపింది. ఎన్సిడబ్ల్యూ ముందు హాజరు కావాలని.. ఆయన వ్యాఖ్యలపై ఆగస్టు 3న విచారణ జరుగుతుందని.. వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!