E20 Petrol: E20 పెట్రోల్‌పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- E20 ఇంధనానికి 52% మంది వ్యతిరేకం.
- E20ను వద్దంటున్న 53% NDA ఓటర్లు.
- మైలేజ్ తగ్గడం, ఇంజిన్ దెబ్బతింటుందనే భయం.
- సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని 76% మంది డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Petrol: కేంద్రంలోని NDA ప్రభుత్వం తీసుకువచ్చని E20 ఇంధనం (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్)పై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా, సీ-ఓటర్ సర్వేలో కేంద్రానికి షాక్ తగిలింది. దేశవ్యాప్తం సర్వేలో సగానికి పైగా ప్రజలు E20 ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపించడం లేదు. జూన్ 8,9 తేదీల్లో 18 ఏళ్లకు పైబడిన 1,641 మందిపై నిర్వహించిన సర్వేలో 52 శాతం మంది E20కి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కేవలం 22 శాతం మాత్రమే మద్దతు తెలిపారు. మరో 25.9 శాతం మంది స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.
సర్వే ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేసిన వారిలో 53 శాతం మంది E20 పెట్రోల్ ఉపయోగించేందుకు ఇష్టపడటం లేదు. దాదాపు 55 శాతం మంది ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల నష్టం కలుగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 52.8 శాతం మంది ఇంజన్ దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 76 శాతం మంది సాధారణ పెట్రోల్‌తో పాటు E20ని కూడా అందుబాటులో ఉంచి, వినియోగదారులు తమకు నచ్చిన ఎంపికకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో E20 ధర, సాధారణ పెట్రోల్ కన్నా తక్కువగా ఉండాలని చెప్పారు.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
పాత వాహనాలకు E20ని తప్పనిసరి చేయడం సరికాదని 56.3 శాతం మంది చెప్పారు. బీజేపీ ఓటర్లలో 49.2 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 43 శాతం మంది బీజేపీ ఓటర్లు E20 వల్ల భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశ ఇంధన భద్రత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్రం మాత్రం E20 విధానానికి మద్దతు తెలుపుతోంది. దీని వల్ల వాహనాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. మరోవైపు, రైతులకు కూడా మేలు కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఇథనాలు కలపడం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని వెల్లడిస్తోంది.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!