Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
- పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్.
- ఉగ్రసంస్థలు లష్కరే తోయిబా, TRF చీఫ్‌గా హఫీజ్ సయీద్ పేరు చేర్చిన ఎన్ఐఏ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hafiz Saeed: పహల్గామ్ ఉగ్ర దాడి కేసులో నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సయీద్‌పై ఎన్ఐఏ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. భారత్, అమెరికాలు సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. 2008 ముంబై ఉగ్రవాద దాడులకు కూడా ఇతే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు.
ఛార్జిషీట్ ప్రకారం, 76 ఏళ్ల హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా, దాని అనుబంధ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కు అధిపతిగా పేర్కొంది. ఇతడిపై భారతీయ న్యాయ సంహిత- 2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)-1967లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సర్గోధా నివాసి అయిన హఫీజ్ సయీద్ పరారీలో ఉన్న నిందితుడని కోర్టు తెలిపింది. దీంతో కోర్టు అతడిపై ఓపెన్ డేటెడ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
గతేడాది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిపి 26 మందిని చంపేసింది. వీరిలో చాలా మంది పర్యాటకులు. ఈ ఘటన తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ భారత సాధారణ ప్రజలపై దాడులు చేయడానికి ప్రయత్నించడంతో, ఆ దేశ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కీలక స్థావరాలను భారత్ వైమానిక దాడిలో ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!