కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివాదాస్పద "రాష్ట్రపత్ని" వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. "నోరు జారి అలా మాట్లాడానని హామీ ఇస్తున్నాను. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతున్నాను. మా క్షమాపణలను అంగీకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను." అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు.
Women's Panel Issues Notice To Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేద్ధాం అని చూసిన కాంగ్రెస్ పార్టీ.. అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఢిపెన్స్ లో పడింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ముర్మును ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించడంతో…
పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీల అనుచిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి.
తాజా వివాదంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. తాను క్షమాపణ చెబుతానని.. తనను ఉరితీసినా తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని.. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.