Nagarjuna Fires on Shivaji and Sundeep on Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం చివరికి వచ్చేయగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో నాగార్జున హౌజ్ లోని కొంతమంది బెండు తీసే పనిలో పడ్డారు అని ఆ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఆ కంటెస్టెంట్ చేసిన పనికి డైరెక్ట్ ఇంటికి పంపించాలని కూడా నిర్ణయించడం హాట్ టాపిక్ అయింది. ఈ బిగ్ బాస్ హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఇప్పటికే ముగ్గురు ( కిరణ్, షకీలా, దామిని) ఎలిమినేట్ అయ్యి… కేవలం 11 మంది మిగిలారు. అయితే అందులో నలుగురు (ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి.. ఇటీవల పల్లవి ప్రశాంత్)హౌస్ మేట్స్ గా ఎంపిక అయ్యారు. ఇక తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కాగా అందుల నాగ్ ఓ బెల్టు పట్టుకుని కనిపిస్తున్నారు.
Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
ఇక హౌస్ లోని సంచాలక్ సందీప్ పై నాగ్ ఫైర్ అయ్యాడు, నీకు కళ్లు కనిపిస్తాయా.. లేక గుడ్డొడివా అంటూ ఫైర్ అయ్యారు నాగార్జున. అటు శివాజీ పైన కూడా నాగ్ ఫుల్ ఫైర్ అవుతూ మీకూ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్కులో గౌతమ్ మెడకు చాలా ఘోరంగా టేస్టీ తేజా బెల్టు వేసి విచక్షణరహితంగా ప్రవర్తిస్తాడు అయితే అక్కడ ఉన్న సంచాలక్ కానీ, శివాజీ కానీ ఎవరూ మాట్లాడరు. టేస్టీ తేజ టర్మ్ వచ్చేసరికి బెల్టు వేస్తుంటే శివాజీ మెడకు తగులుతుందని అనడంతో ఆ రెండు వీడియోలు చూపి నాగ్ ఫైర్ అయ్యాడు. టేస్టీ తేజాకి ఏం శిక్ష వేయాలని హౌస్ లోని మెంబర్స్ ను అడిగితే… జైలుకు పంపుదాం అని శుభ శ్రీ చెప్తే నువ్వేం అంటావ్ సందీప్.. అని నాగార్జున అడగడంతో డైరెక్ట్‌గా పంపేద్దాం సార్ అని చెప్తాడు. ఇంతటితో ప్రోమో ముగియడం హాట్ టాపిక్ అవుతోంది.