Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- యుద్ధం మాకు ఇష్టం లేదు
- దేశాన్ని కాపాడుకుంటాం!
- ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం
- రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ దేశ భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని మాట్లాడారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ బడ్జెట్‌తో పాటు స్వదేశీ రక్షణ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నామని తెలిపారు. దేశ రక్షణ బడ్జెట్‌ను రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెంచినట్లు గుర్తుచేశారు. అంటే రక్షణ బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. రక్షణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపైనా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఒక్క రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ కూడా నష్టాల్లో లేదని పేర్కొన్నారు.
భారత్‌లోనే రక్షణ పరికరాలు, ఆయుధాల తయారీకి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, దేశీయంగా డిజైన్, అభివృద్ధి, తయారీ సామర్థ్యాలను పెంచుతున్నట్లు వివరించారు. “డిజైన్ చేయాలి.. అభివృద్ధి చేయాలి.. భారత్‌లోనే తయారు చేయాలి.. ఇదే మేం పనిచేస్తున్న విజన్” అని అన్నారు. భారత్ యుద్ధానికి అనుకూలం కాదని.. అయితే దేశ సార్వభౌమత్వం, భద్రతను కాపాడుకోవడం విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ రక్షణ సామర్థ్యం ప్రపంచానికి కనిపించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్‌లో సాంకేతికత, స్వదేశీ రక్షణ వ్యవస్థలు, సాయుధ దళాల సమన్వయం ప్రాధాన్యం సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా స్వదేశీ రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా సైబర్, డ్రోన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి రంగాల్లో సాంకేతిక సామర్థ్యాలను పెంచుతున్నట్లు చెప్పారు.
సైన్యానికి స్వేచ్ఛ
దేశ భద్రత అవసరాల దృష్ట్యా సాయుధ దళాలకు అవసరమైన ‘ఆపరేషనల్ ఫ్రీడమ్’ ఇచ్చామని తెలిపారు. సైనికుల ఆధునీకరణతో పాటు మాజీ సైనికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. దేశ భద్రతకు స్వావలంబన ఎంతో కీలకమని పేర్కొన్నారు. “ఒక దేశం స్వయం సమృద్ధిగా ఉన్నప్పుడే దాని జాతీయ భద్రత మరింత పటిష్ఠంగా ఉంటుంది” అని వివరించారు. భారత్ దౌత్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందని.. అయితే దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు. 2014 తర్వాత భారత్ వ్యూహాత్మక ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందన్నారు.
గత ప్రభుత్వాల వైఖరిని ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో భారత్ ఒక భ్రమలో జీవిస్తోందని అంగీకరించారని, ఆ తర్వాతి నాయకత్వాలు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. దేశ భద్రతలో దౌత్యానికి, సైనిక సన్నద్ధతకు సమతుల్యత ఉండాలని చెప్పారు. అంతర్జాతీయ సమస్యలను దౌత్య మార్గాల్లో పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, అదే సమయంలో బహుళపక్ష అంతర్జాతీయ వేదికల్లో భారత్ భాగస్వామ్యం కూడా పెరిగిందని తెలిపారు.
‘అణు బెదిరింపులను సహించం’
అణు బెదిరింపులు, ఉగ్రవాదం విషయంలో భారత్ స్పష్టమైన వైఖరిని ఏర్పరచుకుందని అన్నారు. ఉగ్రవాదం, చర్చలు, వాణిజ్యం ఒకేసారి కొనసాగలేవు అని పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన అంశాన్ని కూడా రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తుందనే సందేశాన్ని ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. “రక్తం, నీరు కలిసి ప్రవహించవని స్పష్టం చేసేందుకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
1998 అణు పరీక్షల ప్రస్తావన
1998లో భారత్ నిర్వహించిన అణు పరీక్షలను కూడా ప్రస్తావించారు. ఆ నిర్ణయం ద్వారా దేశ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే చర్యలను భారత్ సహించబోదనే స్పష్టమైన సందేశం వెళ్లిందని అన్నారు. “1998లో భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. దీనిని ‘రూబికాన్ దాటడం’గా అభివర్ణించారు. దేశ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే చర్యలను భారత్ సహించబోదనే విషయాన్ని అది స్పష్టం చేసింది” అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనతో పాకిస్థాన్ నిర్దేశిత ‘లక్ష్మణ రేఖ’ను దాటిందని అన్నారు.
దేశ భద్రతను కేవలం భౌగోళిక సరిహద్దుల ఆధారంగా మాత్రమే అంచనా వేయలేమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మారుతున్న కాలంతో పాటు దేశాలకు ఎదురయ్యే ముప్పుల స్వరూపం కూడా మారుతోందని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా సాయుధ దళాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతను కేవలం భౌగోళిక పరిధులకే పరిమితం చేయడం సరైన విధానం కాదని అన్నారు. భారత్‌కు వ్యూహాత్మక ఆలోచనలో సుదీర్ఘమైన సంప్రదాయం ఉందని అన్నారు. ప్రాచీన భారతదేశంలోని వ్యూహకర్త చాణక్యుడు, చక్రవర్తి అశోకుడిని ప్రస్తావిస్తూ.. శక్తి, శాంతి రెండింటినీ సమన్వయంతో చూడటం భారత వ్యూహాత్మక ఆలోచనలో భాగమని పేర్కొన్నారు.
దేశ అంతర్జాతీయ ప్రభావంలో సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ రెండూ పరస్పరం సహకరించగలవని చెప్పారు. అయితే ఒకదాని స్థానాన్ని మరొకటి భర్తీ చేయలేవని స్పష్టం చేశారు. మారుతున్న భద్రతా పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మక ఆలోచన, రక్షణ సన్నద్ధత, సాంకేతిక సామర్థ్యాలను సమాంతరంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!