Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
- ముస్లింలను అఖిలేష్ ఓటర్లుగానే చూస్తున్నాడు..
- దమ్ముంటే ముస్లిం వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి..
- అఖిలేష్‌పై ఓవైసీ తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అసదుద్దీన్ ఓవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అఖిలేష్ ముస్లింలను నాయకులుగా కాకుండా ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. ఇకపై ముస్లింలు తమ రాజకీయ నాయకత్వాన్ని వారే నిర్మించుకుంటారని చెప్పారు. ‘‘అబ్దుల్ ఇకపై చాప పరవడు. మేము మీ ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుతాం’’ అని సవాల్ విసిరారు. ముస్లిం సమాజం రాజకీయాల్లో గౌరవప్రదమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఆయన అన్నారు.
ముస్లిం ముఖ్యమంత్రి కావాలని అఖిలేష్ యాదవ్ కోరుకుంటే, పక్కకు తప్పుకుని సొంత పార్టీలోని ముస్లిం వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు. ‘‘మీరు ఎన్నో ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీ పదవీకాలం 2017లో ముగిసింది. ఇప్పుడు మీరు ముస్లిం ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారా? ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి!’’ అంటూ అఖిలేష్‌పై ఫైర్ అయ్యారు.
Also Read
అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించాలన్న అఖిలేశ్ యాదవ్ నిర్ణయంపైనా ఒవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై తమ పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నించాలని సూచించారు. అజం ఖాన్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో మీ నాయకులు రామ మందిరాన్ని ఎందుకు సందర్శించడానికి అయోధ్య వెళ్తు్న్నారు అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో భయాందోళనల వాతావరణం నెలకొని ఉందని, యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆయన విమర్శించారు. తమ కూటమిలో చేరాలని చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లను కూడా ఆహ్వానించారని ఒవైసీ తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ ప్రతీసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతోందని, అయితే ఎప్పుడు అధికారంలోకి వస్తారని ఓవైసీ ప్రశ్నించారు. తమ కూటమి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తుందని, బ్రహ్మణులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారికి చోటుందని చెప్పారు.
#WATCH | Lucknow | AIMIM chief Asaduddin Owaisi says, "…Akhilesh Yadav should go ahead, name one! Pick anyone from your party and step aside to let them lead. Who is stopping you? You were the Chief Minister for so many years, and your tenure ended in 2017. Now you talk about having a Muslim Chief Minister? Take a look at yourself in the mirror! Remember the Muzaffarnagar incident? More than 50,000 people were left homeless. How can you even talk about ‘safety’? Our alliance has been formed with mutual respect, with the aim of providing a strong political alternative for Uttar Pradesh. We have named Chandrashekhar Sahab as our Chief Ministerial candidate…They are feeling uneasy now, which is why they are making such nonsensical and erratic statements…"
— ANI (@ANI) November 12, 2026
తాజావార్తలు
-
Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!