ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలనుకుంది భార్య.. ప్లాన్ ప్రకారం అతడు తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. అయినా చావకపోవడంతో కరెంటు షాకిచ్చి చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని బిజ్జూ గ్రామంలో జరిగింది. అయితే భర్త మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా అంత్యక్రియలు జరిగేలా ప్లాన్ చేసింది. కాగా, సునీత భర్త బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తను చంపడానికి ప్రియుడు నిహాల్ సింగ్‌తో కలిసి సునీతే పథకం వేసిందని తెలిసి బంధువులు షాక్ కి గురైయ్యారు. వారిద్దరిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు పోలీసులు.