kidney Operation: ఎడమ కిడ్నీ బదులు, కుడి కిడ్నీ తొలగింపు.. మహిళ పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kidney Operation: రాజస్థాన్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని జుంజునులో కిడ్నీలో రాళ్లు ఉండటంతో మహిళను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పాడైన ఎడమ కిడ్నీని తీయాల్సిన వైద్యులు, మంచిగా పనిచేస్తున్న కుడి కిడ్నీని శరీరం నుంచి తొలగించారు. తన భార్య ఆరోగ్యవంతమైన కిడ్నీని తొలగించారని భర్త ఆరోపించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాను ఆపరేషన్ సరిగానే చేశానంటూ వైద్యుడు ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ధంఖర్ ఆస్పత్రిలో డాక్టర్ సంజయ్ ధంఖర్ ఈ ఆపరేషన్ చేశారు.
బాధితురాలని నువా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఈద్ బానోగా గుర్తించారు. ఆమె గత కొంత కాలంగా కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతోంది. దీని కారణంగా ఆస్పత్రికి వెళ్లారు. కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత, కిడ్నీలో రాళ్ల వల్ల కిడ్నీ పాడైపోయిందని, దానిని అత్యవసరంగా తొలగించాలని డాక్టర్ ధంఖర్, బానోకి తెలియజేశాడు. బానో కుటుంబం ఆపరేషన్‌కి అంగీకరించింది. మే 15న శస్త్రచికిత్స జరిగింది. అయితే, డాక్టర్ ధంఖర్ దెబ్బతిన్న ఎడమ కిడ్నీకి బదులుగా, ఆరోగ్యం ఉన్న కుడి కిడ్నీని తొలగించారని కుటుంబం ఆరోపించింది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్..
ఆపరేషన్ జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ ధంఖర్ ఆమెను జైపూర్‌లో చికిత్స కోసం తీసుకెళ్లాలని సూచించారు. మే 15న ఆమెకు జరిగిన ఆపరేషన్ గురించి ఎవరికీ చెప్పద్దని చెప్పిటన్లు బానో కుటుంబ చెప్పింది. ఆమెను సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి చేర్చినప్పుడు, వేరే మార్గం లేక ఆమెను ఇంటికి తిరిగి పంపించారు. వైద్యుల నిర్లక్ష్యం బయటపడటంతో డాక్టర్ ధంఖర్, బానో కుటుంబాన్ని కలుసుకుని, ఆమె వైద్యానికి డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. అయితే, ఆమె కుటుంబం ఈ ప్రతిపాదనను ఒప్పుకోకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసింది. బానో భర్త షబ్బీర్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి ధన్‌ఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ మాత్రం బానో కుటుంబ ఆరోపణల్ని ఖండించారు. ఆమె కుడి కిడ్నీ పాడైపోయిందని, దాని కారణంగానే తొలగించానని చెప్పాడు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజ్‌కుమార్ డాంగీ ఐదుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఆసుపత్రి రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.డాక్టర్ ధంఖర్ జుంజునులోని బీడీకే ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్‌గా చేరాడు, రోగి మరణించిన తర్వాత 2017లో సస్పెండ్ చేయబడ్డాడు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!