Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- జగన్‌పై మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు
- వెలిగొండ ప్రాజెక్టుపై గత ప్రభుత్వంపై ఆరోపణలు
- కూటమి ప్రభుత్వంలో వేగంగా సాగుతున్న పనులు
- నిర్వాసితులకు నిధులు.. ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu : “రాష్ట్రంలో ఎలాంటి క్రెడిట్ లేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన క్రెడిట్లను మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చోరీ చేయలేరు. ఎందుకంటే హత్యలు, దోపిడీలు, గొడ్డలి పోట్లు, నిరంతర అసత్యాలు మాట్లాడటమే ఆయనకున్న అసలైన క్రెడిట్” అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జరిగిన దగాను లెక్కలతో సహా ఎండగట్టారు.
పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితమా?
పనులు ఇంకా ఎంతో మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారని మంత్రి రామానాయుడు మండిపడ్డారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతులను జగన్ ఘోరంగా మోసం చేశారని, తన సొంత పత్రిక, టీవీ ఛానళ్ల ద్వారా టన్నుల కొద్దీ అబద్ధాలను అచ్చేయించి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని భూ నిర్వాసితులకు రూ. 900 కోట్లకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా, గత ఐదేళ్లలో వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టన్నెల్-2 లో 12వ కిలోమీటర్ వద్ద విరిగిపోయి చిక్కుకున్న టీబీఎం (TBM – టన్నెల్ బోరింగ్ మెషిన్)ను తొలగించకుండా చుక్క నీరు కూడా ఇవ్వలేమని తెలిసినప్పటికీ, గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రాజెక్టును గాలికొదిలేసిందని మండిపడ్డారు.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న పనులు
ముప్పై ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు నాడు భూమి పూజ చేసిన నారా చంద్రబాబు నాయుడే, ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల సాగు, తాగు నీటి కల నెరవేర్చబోతున్నారని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత ముగింపు లభిస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో హైకోర్టు అనుమతితో టన్నెల్-2 లో చిక్కుకున్న టీబీఎం తొలగింపు పనులను అత్యంత వేగంగా చేపట్టామని వివరించారు. అలాగే టన్నెల్-1 లో అడ్డుగా పేరుకుపోయిన 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ (వ్యర్థాలు) తొలగింపు పనులలో భాగంగా ఇప్పటికే 40 వేల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను విజయవంతంగా తొలగించామని పేర్కొన్నారు.
పునరావాసానికి రూ. 903 కోట్లు.. ప్రాజెక్టు పూర్తికి రూ. 3,844 కోట్లు అవసరం
నల్లమలసాగర్‌కు పూర్తి స్థాయిలో నీళ్లు నింపడానికి , నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం అదనపు బడ్జెట్లో రూ. 903 కోట్లు కేటాయించిందని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పనులన్నీ సంపూర్ణంగా పూర్తి కావాలంటే ఇంకా రూ. 3,844 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. జగన్ రెడ్డి లాగా కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా, నిధులు కేటాయించి క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!