దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెగా ర్యాలీ వేదికపై నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
Congress-Mehangai Par Halla Bol rally: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. నిత్యవసరాల ధరల పెరుగుదలపై “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ రాంలీలా మైదాన్ లో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ…