Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లక్నో కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. వీర్ సావర్కర్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసులో జనవరి 10, 2025న హాజరుకావాలని ఆయనను కోర్టు ఆదేశించింది. నవంబర్ 2022లో భారతో జోడో యాత్రలో సావర్కర్‌పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదైంది. సావర్కర్‌ని ‘‘బ్రిటీష్ సేవకుడు’’ అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ తన వ్యాఖ్యల ద్వారా సమాజంలో ద్వేషాన్ని, దుష్ప్రవర్తనను వ్యాప్తి చేశారని ఫిర్యాదు పేర్కొంది.
Read Also: Donald Trump: ట్రంప్ రాకముందే.. “సరిహద్దు గోడ”ను అమ్ముకుంటున్న జోబైడెన్..
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A (గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 505 (ప్రజా విధ్వంసం కలిగించే ప్రకటనలు చేయడం)వంటి అభియోగాల కింద నమోదైన కేసులో జనవరి 10, 2025న హాజరు కావాలని కోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది. సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ జాతీయవాది సావర్కర్‌ను బ్రిటిష్ సేవకుడిగా అభివర్ణించారని న్యాయవాది నృపేంద్ర పాండే ఫిర్యాదు చేశారు.