Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనవరి 20,2025న ఆయన అధ్యక్ష బాధ్యతల్ని తీసుకోబోతున్నారు. అయితే, ఆయన పదవి చేపట్టే ముందే ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిహద్దు గోడకు సంబంధించిన సామాగ్రిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. దక్షిణ సరిహద్దు గోడకు సంబంధించిన వస్తువుల్ని అమ్ముతున్నాడని రిపబ్లికన్లు, డెమోక్రాట్లను నిందిస్తున్నారు. తర్వాత వచ్చే ట్రంప్‌కి ఇబ్బందులు కలిగించేలా బైడెన్ ప్రవర్తిస్తున్నట్లు రిపబ్లికన్లు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని పంపించేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అమెరికా-మెక్సికో మధ్య భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: RG Kar Case: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కి బెయిల్..
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ఏజెంట్ తీసిన ఒక ఫుటేజీతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అరిజోనా టక్సన్ సమీపంలోని స్టీల్ గోడకు సంబంధించిన భాగాలను లాగుతున్న అనేక ట్రక్కులను ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. రోజూవారీగా అర మైలు విలువైన భాగాలను తొలగించారని అంచనా. నివేదిక ప్రకారం.. అరిజోనాలోని మరానాలోని పినాల్ ఎయిర్ పార్క్‌కు ఈ పదార్థాలను తీసుకెళ్తున్నారు. ఈ విడదీసిన భాగాలకు వేలం జరగనుంది. స్టీల్ బోల్లార్డ్ వాల్ సెక్షన్స్ w/గ్రౌట్‌గా జాబితా చేయబడిన విడిభాగాల వేలం ఈ నెలలో జరిగింది. మరో వేలం డిసెంబర్ 18న జరుగుతుందని డైలీ వైర్ పేర్కొంది.
అయితే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్, డొనాల్డ్ ట్రంప్ దీనిపై వ్యాఖ్యానించలేదు. దీనిని పలువురు రిపబ్లికన్న నేతలు విధ్వంసక చర్యగా పేర్కొన్నారు. బైడెన్ పరిపాలన సరిహద్దు గోడల్ని మళ్లీ కట్టకూడదని చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.