Rahul Gandhi with truck drivers : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల అనంతరం కొద్ది రోజులు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహించారు. అనంతరం సోమవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 1 వరకు అమెరికాలోనే పర్యటించనున్నారు. అయితే రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కంటే ముందు రాత్రి పూట ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఢిల్లీ నుంచి చండీగడ్‌కు ట్రక్కులో ప్రయాణించారు. ట్రక్కులో ప్రయాణించాల్సిన అవసరం ఎంటని అందరూ భావించారు. అయితే భారీ వాహనాలను నడిపే ట్రక్కు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం కోసం వారితో లారీ(ట్రక్కు)లో ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు రాత్రి ట్రక్కులో ప్రయాణించారు. రాత్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రయాణ సమయంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి అనుభవాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణ సందర్భంగా డ్రైవర్లతో కలిసి ఓ ధాబాలో డిన్నర్ కూడా చేశారు. డ్రైవర్లతో గడిపిన వీడియోను రాహుల్ తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఢిల్లీ-చండీగఢ్ వరకు ఆరు గంటల ప్రయాణంలో ట్రక్కు డ్రైవర్లతో ఆసక్తికరమైన సంభాషణ..! అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చిన రాహుల్ .. అందుకు సంబంధించిన 35 సెకండ్ల వీడియోను పోస్ట్ చేశారు. పూర్తి వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.
6 घंटो की दिल्ली-चंडीगढ़ यात्रा में ट्रक ड्राइवरों के साथ दिलचस्प बातचीत!
24 घंटे सड़कों पर बिताकर, वो भारत के हर कोने को जोड़ते हैं।
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/2O2eYxuj0P pic.twitter.com/ZBDe7UaYot
— Rahul Gandhi (@RahulGandhi) May 29, 2023