మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు.. తాజాగా ఆమె పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా అశ్లీల వీడియోల్ని పంపిణీ చేసి డబ్బు సంపాదించారన్న ఆరోపణలపై ఎర్నాకుళం సీజేఎం కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగారు. ప్రజా కార్యకర్త మార్టిన్ మెనాచేరి ఫిర్యాదు చేయగా, దానిపై స్పందించిన న్యాయస్థానం, ఐటీ చట్టంలోని సెక్షన్ 67(A) కింద కేసు నమోదు చేయాలని సూచించింది. అంతేకాకుండా, అశ్లీలత నిరోధక చట్టం ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read : Mani Ratnam : మణిరత్నం.. లవ్ డ్రామాకి హీరో హీరోయిన్ ఫిక్స్ !
ఫిర్యాదుదారు వాదన ప్రకారం, శ్వేత కొన్ని సినిమాల్లో స్వచ్ఛందంగా నగ్న సన్నివేశాల్లో నటించడమే కాకుండా, కండోమ్ ప్రకటనల్లోనూ బోల్డ్ పాత్రలు పోషించారని ఆరోపించారు. ఈ విధంగా ఆమె డబ్బు కోసమే అశ్లీలతను ప్రోత్సహించారనే అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. ‘రతినిర్వేదం’, ‘పలేరి మాణిక్యం’, ‘కలిమన్ను’ వంటి బోల్డ్ చిత్రాలతో పాటు, ‘సాల్ట్ అండ్ పెప్పర్’ వంటి సాఫ్ట్ కామెడీ మూవీల్లోనూ శ్వేత తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్ మలయాళంలో 2018లో పాల్గొన్న ఆమె ప్రస్తుతం మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘం (AMMA) అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ వివాదం ఆమె రాజకీయ, సినీ ప్రస్థానాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.