Rahul Gandhi: తెల్లవారు జామున ఆజాద్‌పుర్ మండిలో రాహుల్ గాంధీ.. కూరగాయలు, పండ్ల వ్యాపారులతో మాటా మంతీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఈ మధ్య కాలంలో సాధారణ ప్రజానీకంతో కలిసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ట్రక్ డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడం కోసం వారితో సుమారు 2 గంటల పాటు లారీలో ప్రయాణం చేశారు. తరువాత హర్యానాలో రైతులతో మాట్లాడి.. పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని కరన్‌బాగ్‌లోని మెకానిక్‌లను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన ఆజాద్‌పుర్ మండిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఢిల్లీలోని ఆజాద్‌పుర్ మండికి వెళ్లారు. అక్కడ కూరగాయలు, పండ్ల వ్యాపారులు, స్థానికులతో రాహుల్ ముచ్చటించారు. కూరగాయల ధరలపై రాహుల్ వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత శనివారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో రాహుల్ గాంధీ ఆజాద్‌పుర్ మార్కెట్‌కు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్న తర్వాత ఈ ఆకస్మిక పర్యటన చోటు చేసుకోవడం విశేషం. ఆ వీడియోలో ఓ వ్యక్తి కన్నీటి పర్యంతమైన దృశ్యం కనిపిస్తోంది.
Read also: TS High Court: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారితో మాట్లాడుతూ .. దేశాన్ని రెండు వర్గాలుగా చీల్చారు. ఒకవైపు అధికారాన్ని కాపాడుకునేవాళ్లు. మరోవైపు సాధారణ వ్యక్తి. ఎవరి సలహాలతో దేశ విధానాలను రూపొందిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యం లేకుండా చూడాలి.. సామాన్యుల కన్నీళ్లను తుడవాలని రాహుల్ పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ హరియాణాలోని సోనిపత్ రైతులతో సమావేశమైన విషయం తెలిసిందే. మదీనా గ్రామంలో రాహుల్ పొలంలో ట్రాక్టర్‌తో దున్నారు. ఆ తర్వాత కూలీలతో కలిసి నాటు వేసి, వారితో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని కరన్‌బాగ్‌లో మెకానిక్‌లను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆజాద్‌పుర్ మండికి వెళ్లి అక్కడ కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
जननायक राहुल गांधी जी आज दिल्ली की आजादपुर मंडी में सब्जी और फल विक्रेताओं से मिले।
राहुल जी ने उनकी समस्याओं को जाना और समझा।
भारत जोड़ो यात्रा जारी है… 🇮🇳 pic.twitter.com/g0PuMD3tEi
— Congress (@INCIndia) August 1, 2023
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!