Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం

  • ఉత్తరప్రదేశ్‌లో తుఫాను బీభత్సం
  • 100 మంది మృతి.. పలువురికి గాయాలు
  • మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం
  • యూపీ తుఫాన్ మృతులకు పుతిన్ సంతాపం
Putinphonecall

Putinphonecall

రష్యా అధ్యక్షుడు పుతిన్.. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు సంతాపం సందేశం పంపించారు. ఉత్తరప్రదేశ్‌లో తుఫాను వల్ల జరిగిన ప్రాణ నష్టంపై పుతిన్ విచారం వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ములకు సందేశం పంపారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బుధవారం ఉత్తరప్రదేశ్‌లో తుఫాను బీభత్సం సృష్టించింది. సుమారు 19 జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. 100 మందికి పైగా మరణించారు. బుధవారం ఊహించని రీతిలో రాష్ట్రమంతటా తుఫాన్ కకావికలం చేసింది. పెద్ద ఎత్తున గాలులు, వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్థం అయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 21 మంది మృతి చెందారు.

భదోహిలో 18 మంది, మీర్జాపూర్‌లో 15 మంది, ఫతేపూర్‌లో 10 మంది, ఉన్నావ్, బదాయూన్‌లలో చెరో ఆరుగురు, ప్రతాప్‌గఢ్, బరేలీలలో చెరో నలుగురు, అలాగే సీతాపూర్, రాయ్‌బరేలి, చందౌలీలలో ఇద్దరు చొప్పున మరణించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆర్థిక సాయాన్ని పంపణీ చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐదారు జిల్లాల్లో హోరుగాలి, వర్షం బీభత్సం సృష్టించింది. హోర్డింగులు, రేకుల షెడ్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరియాయి. ఒక వ్యక్తి అయితే గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.