PM Modi: సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం
- సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం
- వామపక్షాల వెలుగు అంటూ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఏచూరికి మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి వామపక్షాల వెలుగు అంటూ కొనియాడారు. ఈ మేరకు సీతారాం ఏచూరికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. వామపక్షాలకు అగ్రగామిగా నిలిచారని కొనియాడారు. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా పని చేశారని ప్రశంసించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి, అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లో అందరితో కనెక్ట్ అయ్యే నాయకుడని తెలిపారు.
ఇది కూడా చదవండి: Breaking News: హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్..
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌పై ఏచూరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉంటే సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు దానం చేశారు. బోధన, పరిశోధన ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులు ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా ఇచ్చారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి దానం చేయడంతో ఇక ఆయన అంత్యక్రియలు ఉండవు. ఏచూరి కోరిక మేరకే కుటుంబ సభ్యుల ఇలా చేశారు. తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వాలని ఏచూరి కోరారు.
ఇది కూడా చదవండి: Immunity: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే!
1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. ఏచూరి మద్రాస్‌లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు.
Saddened by the passing away of Shri Sitaram Yechury Ji. He was a leading light of the Left and was known for his ability to connect across the political spectrum. He also made a mark as an effective Parliamentarian. My thoughts are with his family and admirers in this sad hour.… pic.twitter.com/Cp8NYNlwSB
— Narendra Modi (@narendramodi) September 12, 2024
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!