PM Modi: మే 2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4న ప్యారిస్ చేరుకుంటారు. ఈ మేరకు మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (IGC) 6వ ఎడిషన్‌లో ప్రధాని మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్హాగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ప్యారిస్‌లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరుపుతారు. గత ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ భారీ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మోక్రాన్ను అభినందించనున్నారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
Central Government: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై సబ్సిడీ పెంపు
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు