Prashant kishor: కాంగ్రెస్ పై పీకే సంచలన వ్యాఖ్యలు… అక్కడ కూడా గెలవదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్తాన్ ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శిబిర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. దీని వల్ల కాంగ్రెస్ అధిష్టానం వారి నాయకత్వానికి కొంత సమయం ఇవ్వడం తప్పా సాధించిందేం లేదని.. రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందని ట్వీట్ చేశారు.
ఇటీవల వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రశాంత్ కిషోర్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ మళ్లీ గాడిలో పడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు పీకే. పార్టీ నిర్మాణంతో పాటు వ్యూహాల్లో కూడా కీలక మార్పులను సూచించారు. ఆదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక బాధ్యతలను చేపడుతారని ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆ తరువాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని పీకే తెలిపారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీనే అని గతంలో పలు మార్లు పీకే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లేకుండా ఎలాంటి ఫ్రంట్ కూడా సాధ్యం కాదని వెల్లడించారు.
Also Read
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
అయితే పీకే సూచించిన సూచనలను ‘చింతన్ శిబిర్ ’లో అమలు చేస్తారని పార్టీ నిర్మాణంలో కీలక మార్పులతో పాటు అధ్యక్ష ఎన్నికలు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం కొన్ని కీలక నిర్ణయాలను మాత్రమే తీసుకుంది. ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’, పార్టీలో కనీసం 5 ఏళ్లు పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని… రాజ్యసభ స్థానం ఒకరికి రెండు సార్లు మాత్రమే కేటాయిస్తామనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కానీ పార్టీలో సంస్థాగత నిర్మాణంపై పెద్దగా చింతన్ శిబిర్ లో చర్చించలేదు. ఈనేపథ్యంలో పీకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir
In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP!
— Prashant Kishor (@PrashantKishor) May 20, 2022
తాజావార్తలు
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!