ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్తాన్ ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శిబిర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. దీని వల్ల కాంగ్రెస్ అధిష్టానం వారి నాయకత్వానికి కొంత సమయం ఇవ్వడం తప్పా సాధించిందేం లేదని.. రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందని ట్వీట్ చేశారు. ఇటీవల వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేలా…