ఢిల్లీ వేదికగా ఇవాళ ఎన్సీపీ అధినేత, రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రకాశం కిషోర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది… ఇంతకుముందే ఈ ఇద్దరు చర్చలు జరపడం హాట్ టాపిక్ కాగా.. ఇవాళ మరోసారి సమావేశమయ్యారు.. ప్రాంతీయ పార్టీలతో ‘థర్డ్ ఫ్రంట్’పైనే సమాలోచనలు జరిగినట్టు ప్రచారం సాగుతోంది.. “జాతీయ కూటమి” ఏర్పాటుకు ఎలా ముందుకు సాగాలి అనే దానిపై ఫోకస్ పెట్టారు.. మొత్తానికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయినట్టు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.. రెండు వారాల్లోనే రెండు సార్లు పవార్, పీకే భేటీ కావడం చర్చగా మారింది.. జూన్ 12వ తేదీన ముంబైలో శరద్ పవార్ నివాసంలో మూడు గంటల పాటు సమాలోచనలు సాగగా.. ఈ రోజు ఢిల్లీలో మరోసారి అరగంట పాటు భేటీ జరిగింది.. మరోవైపు.. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు పీకే.. ప్రధాని మోడీకి పోటీగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.. ప్రధాని మోడీ నేతృత్వంలోని అధికార బీజేపీకి ధీటుగా రాజకీయ పార్టీ లన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు మరింత వేగవంతం అయ్యాయి.