Nitish Kumar: నితీష్‌కుమార్‌కు భారతరత్న డిమాండ్.. బీహార్‌లో వెలసిన పోస్టర్లు
- నితీష్‌కుమార్‌కు భారతరత్న డిమాండ్
- బీహార్‌లోని పాట్నాలో వెలసిన పోస్టర్లు
- నితీష్ అర్హుడంటూ పోస్టర్లలో రాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. పైగా త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలంటూ పాట్నా నగరమంతా జేడీయూ శ్రేణులు పోస్టర్లు అంటించారు. భారతరత్నకు నితీష్ కుమార్ అర్హులని పోస్టర్లలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Congress: కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దివంగత నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు మోడీ సర్కార్ భారతరత్న ఇచ్చింది. దీంతో కొన్ని వర్గాల నుంచి సానుభూతి ఓట్లను రాబట్టుకున్నారు. త్వరలో బీహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆర్జేడీ గట్టి పోటీ ఇస్తుంది. అంతేకాకుండా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కొత్త పార్టీ స్థాపించారు. అంటే ఈసారి ఎన్నికల్లో రసవత్తర పోటీనే ఉండనుంది.
ఇది కూడా చదవండి: GTRI: చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత.. భారత్‌కు బంపర్ అవకాశం..!
మరోసారి అధికారం కోసం జేడీయూ ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగానే భారతరత్న డిమాండ్ తెరపైకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ సుదీర్ఘ కాలం రాష్ట్రానికి సేవలందించారని.. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గట్టెక్కాలంటే సముచిత గౌరవాన్ని ఇవ్వాలని జేడీయూ నాయకుడు వ్యాఖ్యానించారు. నితీష్.. భారతరత్నకు పూర్తి అర్హుడని చెప్పుకొచ్చారు. వాజ్‌పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా నితీష్ సేవలందించారని గుర్తుచేశారు. ఆయన భారత రత్న పురస్కారాన్ని స్వీకరించేందుకు వీటితో పాటు మరెన్నో కారణాలు ఉన్నాయని జేడీయూ పార్టీ పేర్కొంది. ఇక జేడీయూ పోస్టర్లపై ఆర్జేడీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సీఎం కుర్చీని ఖాళీ చేయాలంటూ నితీష్‌పై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Kawasaki: కవాసకి నింజాపై దీపావళి ఆఫర్.. భారీగా డిస్కౌంట్
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!