బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. పైగా త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలంటూ పాట్నా నగరమంతా జేడీయూ శ్రేణులు పోస్టర్లు అంటించారు. భారతరత్నకు నితీష్ కుమార్ అర్హులని పోస్టర్లలో పేర్కొన్నారు.