Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్
- కింద పడిపోయిన బైకర్.. పలుచోట్ల గాయాలు
- ఉద్దేశపూర్వకంగా చేయలేదన్న నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఓ కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి పారిపోయాడు. దీంతో మహిళా బైకర్ కిందపడిపోగా.. బైక్ కొంత దూరం నిప్పులు చిమ్ముకుంటూ వెళ్లి ఆగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మహిళా బైకర్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.
మహిళా బైకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ బైన్స్లా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బైక్‌ను తాను కావాలనే ఢీకొట్టలేదని, ప్రమాదం అనుకోకుండా జరిగిందని తెలిపాడు. అంతేకాకుండా బైక్‌పై మహిళ ఉన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పాడు. ప్రమాదానికి ముందు, ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని అన్నాడు. ఇద్దరు బైకర్లు తన కారును పలుమార్లు ఓవర్టేక్ చేసి.. ఆ తర్వాత తన కారుకు ముందుకు వచ్చి వేగం తగ్గించారని ఆరోపించాడు
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
తన వాదన ప్రకారం.. బైకర్లు కారు అద్దాన్ని సరిగ్గా గమనించకుండా ఒక్కసారిగా బైక్‌ను తిప్పడంతో అదుపు తప్పి ప్రమాదం జరిగిందని చెప్పాడు. తప్పు జరిగిందని అంగీకరించినప్పటికీ, బైక్‌ను కావాలనే ఢీకొట్టలేదని స్పష్టం చేశాడు. ‘‘ప్రమాదం అనుకోకుండా జరిగిందని అనుకుందాం. తప్పు జరిగిందని నేను అంగీకరిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. తాను బైకర్లను ఢీకొట్టేందుకు ప్రయత్నించలేదని, బదులుగా నెమ్మదిగా వెళ్లాలని వారిని కోరినట్లు బైన్స్లా చెప్పాడు.
ప్రమాదంలో మహిళకు గాయాలైన విషయం తెలిసిన తర్వాత బాధపడ్డానని బైన్స్లా తెలిపాడు. అయితే ప్రమాద సమయంలో బైక్‌పై ఎవరు ఉన్నారో తనకు తెలియదని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన బైకర్ల కెమెరా ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు వెంబడించిందని.. డ్రైవర్ దూకుడుగా కారు నడిపి తన బైక్‌ను ఢీకొట్టాడని మహిళ ఆరోపించింది. ప్రమాదం తర్వాతి దృశ్యాలను మరో బైకర్ హెల్మెట్‌కు అమర్చిన కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రమాదం అనంతరం కారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగగా.. ఓ బైకర్ కారు దగ్గరకు వెళ్లి డ్రైవర్‌ను ప్రశ్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీసులు సుమోటోగా స్పందించి గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు బాధిత మహిళ తన న్యాయవాది ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తానని తెలిపింది. తనపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని కూడా బైన్స్లా స్పష్టం చేశాడు. ‘‘నా పేరుపై ఇప్పటివరకు ఎలాంటి కేసూ లేదు’’ అని తెలిపాడు. తనపై వస్తున్న ఆరోపణలు కుటుంబంపై ప్రభావం చూపే పరిస్థితి వస్తే తప్పకుండా స్పందిస్తానని అన్నాడు. ఈ కేసులో బాధితురాలి ఆరోపణలు.. బైన్స్లా చెబుతున్న వివరాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ప్రమాదానికి ముందు.. ప్రమాద సమయంలో ఏం జరిగిందో నిర్ధారించడంలో సీసీటీవీ ఫుటేజీలు, బైకర్ల కెమెరాల్లో రికార్డైన వీడియోలు కీలకంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!